HomeMovie News'కుబేర' సెన్సార్ పూర్తి & రన్ టైం లాక్ 

‘కుబేర’ సెన్సార్ పూర్తి & రన్ టైం లాక్ 

- Advertisement -

అక్కినేని నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో రష్మిక మందన్న హీరోయిన్ గా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కుబేరా. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి సంస్థతో కలిసి అమిగోస్ క్రియేషన్స్ పై శేఖర్ కమ్ముల, పుస్కూర్ రామ్మోహనరావు, సునీల్ నారంగ్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈమూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. జూన్ 20న పలు భాషల ఆడియన్స్ ముందుకి ఈ పాన్ ఇండియన్ మూవీ రానుంది. కాగా తాజాగా నేడు కుబేరా యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా దీనికి యు / ఏ సర్టిఫికెట్ ని అందించారు.

ఇక ఈ మూవీ యొక్క టోటల్ రన్ టైం 181 నిముషాలుగా లాక్ అయింది. ఇప్పటివరకు ఎక్కువగా ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైనర్స్ తీసిన శేఖర్ కమ్ముల తొలిసారిగా విభిన్న కథ, కథనాలతో చేసిన ఈ ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటుందని టీమ్ అభిప్రాయపడుతోంది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏస్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

See also  అనుకున్న డేట్ కే రిలీజ్ కానున్న 'కుబేర' 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories